Thursday, December 10, 2015

సర్దుకుపోవడం ఒకకళేసుమా!!
--------------------------
మనలో చాలామందికి సర్దుకుపోవడం అన్న మాటవినగానే, ఒళ్ళంతా
జెర్రులు పాకినట్టూ, వినగూడని విషయమేదో చేవిలో పడినట్లుగా
బాధపడుతూండడం మనం అనునిత్యం చూస్తూనే వుంటున్నాం
కదా ! మన దైనందిన జీవన గమనంలో. అది ఆధారంగాజేసుకుని
ఎన్ని ధారావాహికలు మన కళ్ళెదుట దుస్ఠదర్శనాలలో పురుడు పోసుకున్నాయో,ఇంకా ఎన్ని కధాంశాలు  నిర్మాణసంస్థల బుర్రలను తొలిచేస్తున్నాయోఎవ్వరెరుగరుగనుక? ఒకప్పుడు ఇన్ని సంఘర్షణలు దాంపత్యజీవితాల్లో దర్శనమిచ్చేవికావు, మరెందుకు ఇన్ని కుటుంబాలు
వీధికెక్కుతూ, విడాకులదాకా వెళ్ళిపోతున్నాయి అని మనం అర్ధంచేసుకునే ప్రయత్నం జేయగలిగితే అవన్నీ అవగాహనలోపంవలననే అన్నది మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జగమెరిగిన వాస్తవం.కొత్తగాకోటి ఆశలతో కొత్తదయిన మనయింటికి కుడికాలులోపలబెట్టి
అడుగులు వేసిన యువతికి మనం సరయిన ఆదరణను ఆప్యాయతనభిమానాలను అందించగలుగుతున్నామా? మనకూతురుకన్నా భిన్నంగా మనం ఊహించి
ఆ అమ్మాయిని వివక్షతో చూడకుండా ఉండలేకపోతున్నాం ఎందుకని?

వెనుకటికి  ఓ ఇంటి అల్లుడుగారు, మామగారు పోయాక అత్తగారింటికి వచ్చి ఆదినవారాలకార్యక్రమాలలో ఇరవైమంది పైగా భోజనాలు చేస్తున్న సమయంలో తనకు పీటవేయలేదని విసుక్కుంటూ వెళ్ళిపోతే
అతగాడిని మనం యేవిధంగా అర్ధం చేసుకోవాలి? మళ్ళీ ఆ పెద్దమనిషి పొద్దునలేచింది మొదలు ప్రవచనాచార్యులలాగా అన్నీగ్రందస్థం చేసుకునేలా,  సిద్ధాంతాలూ, సుభాషితాలు,  వల్లె వేస్తూ వుంటాడు!!గ్రందస్థం చేసుకునేలా సిద్ధాంతాలూ, సుభాషితాలు వల్లె వేస్తూ వుంటాడు!!
ఇక్కడ ఎవరయినా ఎలా సర్దుకుపోతారు అన్న ప్రశ్న మన హృదయకుహరాలలో గూడుకట్టుకుని గునపంలా గుచ్చుతూండడం అసహజమేమీకాదుగదా?
కాళ్ళకురాసుకున్న పసుపూ పారాణీ ఆరకముందే ఆ పిల్లలను
పచ్చబద్దలపల్లకీలో ఊరేగిస్తున్న మనం మనప్రవర్తను ఎవరయినా ఎలా అర్ధం చేసుకోవాలి? ఎవరమయినా ఈవిషయాల్లో కంటనీరొలకకుండా ఎలా నిభాయించుకోగలం?మీరే ఊహించండి.ఇక్కడ నాకొక కవిసూక్తం గుర్తుకొస్తూ వుంటుంది.

అల్లుడు శ్రీమహా విష్ణువు
అమ్మాయికొంగట్టుకు తిరుగుతుతాడు.

కొడుకు కొరకరానికొయ్య
కోడలును నెత్తినెట్టుకు ఊరేగుతాడు.
ఇక్కడకొడుకు చేస్తున్నదేమిటి అల్లుడు అంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న నిర్వాకమేమిటి? ఇది మనం మనసులో కట్టుకున్న ఇరుకుగదులలో అనుక్షణం పడే  ఆరాటమహిమ తప్పవేరుకాదుగదా!!